Home  »  TV News  »  శైలేంద్ర దెబ్బకి రిషి కాలేజీ నుండి అవుట్!

Updated : May 27, 2023

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -773 లో....రిషి ని శైలేంద్ర నుండి కాపాడుకోవడానికి.. వసుధార దగ్గర మాట తీసుకొని అబద్ధం చెప్పమని జగతి అడుగుతుంది. అయితే వసుధార మొదట్లో వద్దని చెప్పినా తర్వాత కన్నతల్లిగా రిషి కోసం జగతి పడే తపనకి వసుధారకి తలవంచక తప్పలేదు. అబద్దం చెప్తానని మాట ఇచ్చింది. ఇక మీటింగ్ లో అందరూ రిషి తప్పు చేసాడని అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ మెడికల్ కాలేజీకి ఉపయోగించుకుంటున్నాడని అభియోగం చేసారని జగతి అంటుంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా రిషి, వసుధారలు సంతకం చేసిన చెక్ ఉందని జగతి అంటుంది.

ఆ తర్వాత మేము సంతకాలు పెట్టలేదని రిషి అంటాడు. అయిన సాక్ష్యాలు కన్పిస్తున్నాయి కదా అని జగతి అంటుంది. అలా అనగానే ఆ చెక్ మనం ఇచ్చామా వసుధార అని రిషి అడుగుతాడు. వసుధార ఏడుస్తూ సైలెంట్ గా ఉంటుంది. ఎన్నిసార్లు అడిగినా వసుధార సమాధానం చెప్పకుండా ఉండేసరికి.. రిషికి కోపం వచ్చి.. చెప్పు వసుధార అని గట్టిగ అరుస్తాడు. వసుధార ఏడుస్తూ.. మీరే ఇచ్చారని అబద్ధం చెప్తుంది. వసుధార అలా అనగానే రిషి గుండె ముక్కలవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార నిజం చెప్పమని రిషి అంటాడు. మీరే ఇచ్చారని వసుధార అంటుంది.

నువ్వే ఇచ్చావని వసుధార అంటుంది కదా రిషి.. ఏమైనా దాని గురించి చెప్పాలనుకుంటున్నావా అని రిషిని మినిస్టర్ అడుగుతాడు. తప్పు చేసానని చెప్పకా.. నేనేం మాట్లాడగలను.. దీనికి మీరు ఏ శిక్ష విధించిన బరిస్తానని రిషి అంటాడు. మీరు ఎండి పదవి నుండి తప్పుకోవాలి. కాలేజీకి సంబంధించిన ఏ అడ్మినిస్ట్రేటర్ చెయ్యకూడదు.. వేరే కాలేజీలల్లో కూడా ఎండీ గా భాద్యతలు తీసుకోకూడదని జగతి అంటుంది. అందరూ షాక్ అవుతారు. దేవయాని, శైలేంద్రలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు.

అవును తప్పు చేసాను.. నా చుట్టూ ఉన్న మనుషులను నమ్మి తప్పు చేశాను. ఈ కాలేజీ నాకనవసరం.. ఈ కాలేజీలో ఉండను. మీ జీవితాల్లో కుడా ఉండనని రిషి అంటాడు. మీకు దూరంగా వెళ్ళిపోతాను. ఇక నుండి రిషి ఒంటరి.. ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చిందంటూ.. వసుధార, జగతిలని ఉద్దేశించి అంటాడు. ఆ తర్వాత కొత్త ఎండీగా జగతి మేడం ఉంటారని మినిస్టర్ అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. ఇంత ప్లాన్ చేసింది ఎండీ చేర్ కోసం అలాంటిది పిన్ని ఎండీ నా అని కోపంగా ఉంటాడు.  రిషి బాధపడి వెళ్తుంటే వసుధార, జగతిలు రిషి వెనకాలే వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.